ఎంపీగా పోటీ చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాకు అవకాశమివ్వలే.. అప్పుడు నేనేమీ అధైర్యపడలేదు.. దేవుడి దయ ఉంటే ప్రస్తుతం తానే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని కావొచ్చు.. అది పెద్ద పోస్టే కదా..’ అని మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన పురపాలక ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
భాజపా నుంచి కౌన్సిలర్‌గా పోటీచేసే అవకాశం రాని కార్యకర్తలు నిరాశపడొద్దని.. అవకాశాలు లభిస్తాయని చెప్పారు. తనకు టికెట్ ఇవ్వని కేసీఆర్ తెరాసకు రాష్ట్ర అధ్యక్షుడు అని.. అవకాశం వస్తే భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా తానుంటానని.. అప్పుడు ఇద్దరి పదవులు సమానమే కదా అని మాట్లాడారు. పుర ఎన్నికల్లో పైసా ఖర్చు లేకుండా ప్రచారం చేయాలని సూచించారు.
ఇవీ చూడండి: పాఠశాలలోనే విద్యార్థులకు క్షౌరం.. ఎందుకో తెలుసా?