ETV Bharat / state

భూములు అమ్మి సొమ్ములు తెస్తాం: సీఎం కేసీఆర్​ - భూములు అమ్మి సొమ్ములు తెస్తాం: సీఎం కేసీఆర్​

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల నిర్మాణ పనులను గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్​ పరిశీలించారు. రాబోయే 10 మాసాల్లో ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. వచ్చే ఖరీఫ్​ నాటికి జలాశయాలను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

భూములు అమ్మి సొమ్ములు తెస్తాం: సీఎం కేసీఆర్​
author img

By

Published : Aug 30, 2019, 5:56 AM IST

Updated : Aug 30, 2019, 8:05 AM IST

భూములు అమ్మి సొమ్ములు తెస్తాం: సీఎం కేసీఆర్​

రాబోయే 10 మాసాల్లో పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్​ తెలిపారు. వెయ్యి కోట్లు అప్పులు తీసుకొచ్చామని, వచ్చే బడ్జెటులో మరిన్ని నిధులు కేటాయించి త్వరలోనే ప్రాజెక్టును పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటాన్నారు. నిధులు సరిపోకుంటే.. హైదరాబాదులో ఉన్న విలువైన భూములను అమ్మకానికి పెట్టైనా ఆ డబ్బును పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల నిర్మాణానికి ఖర్చు చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. మూడు షిప్టుల్లో పనిచేసి వచ్చే ఖరీఫ్‌ నాటికి జలాశయాలను అందుబాటులోకి తీసుకురావాలన్నారు.

ప్రాజెక్టుల పనుల పరిశీలన

ఈ ప్రాజెక్టు పూర్తైతే మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వికారాబాద్‌, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలు సస్యశ్యామలం అవుతాయని, హైదరాబాదు తాగునీటి ఎద్దడి తీరుతుందన్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఈ ప్రాజెక్టు పనులను సాగునీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్‌ గురువారం పరిశీలించారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని భూత్పూరు మండలం కరివెన వద్ద నుంచి ఎత్తిపోతల పథకం పనులను ముందుగా విహంగ వీక్షణం ద్వారా పరిశీలించారు. అనంతరం జలాశయం వద్ద పాలమూరు పథకానికి సంబంధించిన చిత్ర ప్రదర్శనను తిలకించారు.

24గంటలు పనులు జరిగేలా చూడాలి

కరివెన జలాశయం పనులను ఎన్ని రోజుల్లో పూర్తిచేస్తారని అధికారులను, ఏజెన్సీలను ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ఏడాదిలోపు చేస్తామని అధికారులు బదులిచ్చారు. ‘అంత ఆలస్యం ఎందుకు?.. నాలుగున్నర నెలల్లో పూర్తి చేయాలి’ అని ఆదేశించారు. 24 గంటలూ పనులు జరిగేలా చూడాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు అలాగే పూర్తయ్యాయన్నారు. ఉదయం ప్రతిపాదనలు పంపితే సాయంత్రానికల్లా నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. పెండింగు బిల్లులను కూడా విడుదల చేస్తానన్నారు. కరివెన, ఉదండాపూర్‌ జలాశయాల నుంచి కోయిల్​సాగర్‌కు నీటిని సరఫరా చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ, పరిహారం సక్రమంగా అందేలా చూడాలన్నారు.

వట్టెం జలాశయాన్ని త్వరగా పూర్తి చేయాలి

ఆరు నెలల్లో వట్టెం జలాశయం పనులను పూర్తి చేయాలని ఇంజినీరింగు అధికారులకు కాలవ్యవధి నిర్దేశించారు. భూసేకరణకు సంబంధించిన నిధులను విడుదల చేస్తానని హామీ ఇచ్చారు. మిగులు భూసేకరణ ఉంటే దాన్ని కూడా పూర్తి చేయాలన్నారు. వట్టెం భూ నిర్వాసితులు తమకు మల్లన్నసాగర్‌ తరహాలో పరిహారం ఇవ్వాలని ముఖ్యమంత్రికి వినతిపత్రం అందించారు. తగిన న్యాయం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

పరిహారం కోసం నిరసన

ముఖ్యమంత్రి రాక సందర్భంగా ముందు జాగ్రత్తగా కరివెన జలాశయం నిర్వాసిత రైతు సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. మల్లన్నసాగర్‌ తరహా పరిహారం కోరుతున్న వీరు సీఎం పర్యటనలో ఆందోళనకు దిగుతారన్న సమాచారంతో అదుపులోకి తీసుకున్నారు. దీనితో బాధిత రైతులు కొంతమంది జడ్చర్ల సిగ్నల్‌గడ్డలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో రాస్తారోకో చేశారు. పరిహారం విషయంలో న్యాయం చేయాలని డిమాండ్​ చేశారు.

ఇవీ చూడండి: పంచాయతీరాజ్​పై సీఎం కేసీఆర్​ సమీక్ష

Last Updated : Aug 30, 2019, 8:05 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.