ETV Bharat / state

పక్క రాష్ట్రాల నుంచి అక్రమంగా ధాన్యం రవాణా..! - మహబూబ్​నగర్ జిల్లా తాజా వార్తలు

ఇతర రాష్ట్రాల్లో తక్కువ ధరకు ధాన్యాన్ని కొని రాష్ట్రంలో మద్దతు ధరకు అమ్మి కొందరు అక్రమార్కులు లాభాలు గడిస్తున్నారు. ఇందుకు స్థానిక నేతలు, అధికారుల అండదండలు కూడా ఉన్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. దీనికి నిదర్శనమే ఉమ్మడి పాలమూరు జిల్లాలో పట్టుబడుతున్న కర్ణాటక ధాన్యం.

అక్రమంగా ధాన్యం
అక్రమంగా ధాన్యం
author img

By

Published : May 23, 2022, 4:48 AM IST

ఇతర రాష్ట్రాల్లో తక్కువ ధరకు ధాన్యాన్ని కొని తెలంగాణలో మద్దతు ధరకు అమ్మి కొందరు అక్రమార్కులు లాభాలు గడిస్తున్నారు. ఇందుకు నిదర్శనమే ఉమ్మడి పాలమూరు జిల్లాలో పట్టుబడుతున్న కర్ణాటక ధాన్యం. కర్ణాటక నుంచి అక్రమంగా మిర్యాలగూడ, హైదరాబాద్ మిల్లులకు వరిధాన్యాన్ని తరలిస్తున్న 16 లారీలను ఈ నెల 15న నారాయణపేట జిల్లా మక్తల్ మండలం చందాపూర్ శివారులో పోలీసులు పట్టుకున్నారు.

యాద్గిర్, సిర్పూరు, మాన్వీల నుంచి తరలిస్తున్నట్లు గుర్తించారు. ఒక్కో లారీపై రూ. 5 వేలు జరిమానా విధించారు. అంతకు ముందు నారాయణపేటలో మే 4న కర్ణాటక నుంచి ధాన్యాన్ని తరలిస్తున్న 6 లారీలను పట్టుకున్నారు. దామరగిద్ద మండలంలో మే 10న బొలేరో వాహనంలో 24 క్వింటాళ్ల ధాన్యం ... మే 11న రెండు లారీల్లో 505 క్వింటాళ్ల ధాన్యాన్ని అక్రమంగా తరలిస్తూ దొరికారు.

జోగులాంబ గద్వాల జిల్లా కేటీ దొడ్డి మండలం నందిన్నె చెక్ పోస్టు వద్ద కర్ణాటక నుంచి అక్రమంగా తరలిస్తున్న 4 లారీలపై కేసు నమోదు చేశారు. పక్క రాష్ట్రం నుంచి వరి ధాన్యం తెలంగాణకు తరలుతోందని చెప్పడానికి ఇవి మచ్చుకు కొన్ని. అధికారులు, పోలీసుల కన్నుగప్పి కర్ణాటక ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో ఇతర రైతుల పేరిట అమ్మే దందా ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొనసాగుతోంది.

ఏప్రిల్‌లో వరి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అప్పుడే పక్క రాష్ట్రాల నుంచి వరి ధాన్యం రాష్ట్రంలోకి రాకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కానీ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలతో సరిహద్దులున్న ఉమ్మడి పాలమూరులో ధాన్యం తరలింపుపై నిఘా కరవైందనే ఆరోపణలు వస్తున్నాయి.

పక్క రాష్ట్రాల్లో క్వింటాకు రూ. 1400 నుంచి రూ.1500లకు కొనుగోలు చేసి.... తెలంగాణకు అక్రమంగా తరలించి రూ.1960కి విక్రయిస్తున్నారు. అందుకు స్థానిక నేతలు, అధికారుల అండదండలు కూడా ఉన్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. అక్రమార్కులు ఇక్కడి కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో కుమ్మక్కై దందా నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఖర్చులు పోను క్వింటాకు రూ.500 వరకూ గిట్టుబాటు అవుతుండటంతో దందా జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది.

పక్క రాష్ట్రాల నుంచి ధాన్యం తెలంగాణలోకి రాకుండా జోగులాంబ గద్వాల జిల్లాలో 7 చెక్ పోస్టులు.. నారాయణపేట జిల్లాలో 6 చెక్ పోస్టులు ఏర్పాటు చేసినా అక్రమ ధాన్యం రాక మాత్రం ఆగడం లేదు. అధికారులు మాత్రం గట్టి నిఘా ఏర్పాటు చేశామని, నిబంధనలకు విరుద్దంగా ఎవరైనా కర్ణాటక ధాన్యాన్ని తెలంగాణలో కొనుగోలు చేసినట్లుగా తేలితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలో యాసంగిలో సుమారు ఏడున్నర లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకూ సుమారు 2 లక్షల మెట్రిక్ టన్నుల వరకూ కొనుగోలు చేశారు. మరో 4 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు కేంద్రాలకు వస్తుందని వారు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తే అర్హులైన రైతులకు ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

ఇదీ చదవండి: 'పంట ధరలకు రాజ్యాంగపరమైన భద్రత ఉండాలి.. ఆ దిశగా రైతు నాయకుల పోరాటం సాగాలి'

రైళ్లలో ఆర్​టీసీ బస్సుల రవాణా.. చరిత్రలోనే తొలిసారి..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.