ETV Bharat / state

సానుకూల దృక్పథంతో కరోనాను జయించొచ్చు

కొవిడ్‌-19 బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నా.. కేసులు నమోదవుతున్నందున జనంలో ఆందోళన పెరుగుతోంది. చికిత్స పొంది తిరిగి వచ్చిన వారు మాత్రం సానుకూల దృక్పథంతో కరోనాను సులువుగా ఎదుర్కొనవచ్చని చెబుతున్నారు. పౌష్టికాహారం.. క్రమం తప్పని వ్యాయామం ద్వారా మహమ్మారిని జయించొచ్చని పేర్కొంటున్నారు.

సానుకూల దృక్పథంతో కరోనాను జయించొచ్చు
సానుకూల దృక్పథంతో కరోనాను జయించొచ్చు
author img

By

Published : Jul 6, 2020, 9:21 AM IST

సానుకూల దృక్పథంతో కరోనాను ఎదుర్కొనవచ్చని చికిత్స పొంది తిరిగి వచ్చిన వారు తెలిపారు. పౌష్టికాహారం, క్రమం తప్పని వ్యాయామం ద్వారా వైరస్‌ను నియంత్రించవచ్చని సలహా ఇస్తున్నారు. కొవిడ్‌ చికిత్స పొంది.. మహమ్మారిని వారు ఎలా జయించారో చెబుతున్నారు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా వాసులు.

మనోధైర్యం కోల్పోవద్దు

నా వయస్సు 50 సంవత్సరాలు. వైద్య, ఆరోగ్యశాఖలో పనిచేసే నాకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో డిప్యుటేషన్‌ విధులు వేయగా కరోనా మహమ్మారి సోకింది. తీవ్రమైన జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడటంతో పరీక్ష చేయించగా పాజిటివ్‌ అని తేలింది. వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. ఉమ్మడి జిల్లాలోనే వైరస్‌ సోకిన మొదటి వ్యక్తిని నేను. తరవాత 73 సంవత్సరాల మా అమ్మకు సోకింది. ఇద్దరికీ గాంధీలో మంచి వైద్యం అందించడం వల్ల కోలుకున్నాం.

కరోనా వచ్చిందని మనోధైర్యం కోల్పోవద్దు. రోజూ ఉదయాన్నే యోగాసనాలు చేశా. ఆస్పత్రిలో ఇచ్చిన పౌష్టికాహారం తీసుకున్నా. 22 రోజులు గాంధీలో ఉన్న తరువాత నెగటివ్‌ రావడం వల్ల ఇంటికి వచ్చి 28 రోజులపాటు ఇంట్లో క్వారంటైన్‌లో ఉన్నా. ఇంటికి వచ్చిన తరవాత కూడా డ్రైఫ్రూట్స్, నిమ్మరసం, రోజూ ఉదయాన్నే పాలలో పసుపు కలుపుకొని తాగాను. అల్లం టీ, వేడి నీళ్లే తాగాను. ఇప్పుడు కోలుకొని విధులకు వెళ్తున్నా. మా అమ్మ కూడా కోలుకుంది. కరోనా రాకుండా జాగ్రత్త పడండి. వస్తే భయపడాల్సిన అవసరం లేదు. సరైన వైద్యం తీసుకోవడం, వంటింటి చిట్కాలతోపాటు వ్యాయామం, యోగాసనాలు చేస్తే రోగనిరోధక శక్తి పెరిగి వైరస్‌ అంతమవుతుంది.

- జడ్చర్ల వాసి

బలవర్ధకమైన ఆహారం.. దైవ ప్రార్థనతో గడిపా :

నా వయస్సు 63 సంవత్సరాలు. మార్చి చివరి వారంలో నాకు వైద్య పరీక్షలు చేయగా ఎలాంటి రోగ లక్షణాలు లేకున్నా కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఏప్రిల్‌ 2 నుంచి మే 13 వరకు 40 రోజుల పాటు గాంధీ ఆస్పత్రిలో ఉంచారు. వారం రోజులపాటు యాంటీబయోటిక్స్‌ ఇచ్చారు. రోజూ విటమిన్‌- సి, బి కాంప్లెక్స్‌ ట్యాబెట్లు వేసుకోమన్నారు. రోజూ సాయంత్రం ఎండు ఫలాలు తినేవాడిని. దైవ ప్రార్థన చేసుకునేవాడిని. కాస్త వ్యాయామం కూడా చేసేవాడిని. మే 10, మే 12న రెండుసార్లు పరీక్షించగా నెగటివ్‌ వచ్చింది. డిశ్చార్జి చేశారు. వైద్యులు సూచించే జాగ్రత్తలు పాటిస్తూ, రోగనిరోధక శక్తిని పెంచే బలవర్ధక ఆహారం తీసుకోవడం, వ్యాయామంతో కరోనాను జయించవచ్చు.

- మహబూబ్‌నగర్‌ వాసి

వైద్యుల సూచనలు పాటించా :

నా వయస్సు 25. హైదరాబాద్‌ ఉస్మానియా ఆస్పత్రిలో పొరుగు సేవల కింద విధులు నిర్వహించేవాడిని. ఏప్రిల్‌ చివరి వారంలో అనుమానంతో పరీక్ష చేయించుకోగా కరోనా పాజిటివ్‌ అని తేలింది. గాంధీ ఆసుపత్రిలో పది రోజులు ఉండి చికిత్స తీసుకున్నా. రోజూ మూడు పూటలు పోషక విలువలున్న ఆహారం, అవసరమైన మాత్రలు ఇచ్చేవారు. వైద్యుల సూచనలు పాటించడం వల్ల త్వరగానే కోలుకున్నా. తరువాత నేను అద్దెకుండే గదిలోనే క్వారంటైన్‌లో ఉన్నా. రోజూ ఉదయం ఎండు ఫలాలు తినేవాడిని. పసుపు నీళ్లు తాగేవాడిని. మధ్యాహ్నం సమయంలో చికెన్, రాత్రి పూట ఉడకబెట్టిన గుడ్లు తినేవాడిని. దీంతో పూర్తిగా ఆరోగ్యవంతుడినయినా. ప్రస్తుతం విధులకు హాజరవుతున్నా.

- పెబ్బేరు యువకుడు

ఆస్పత్రిలో సరదాగా ఉండేవాళ్లం :

నా వయస్సు 40. బంధువుల ద్వారా నెల రోజుల కిందట నాకు కరోనా పాజిటివ్‌ రావడం వల్ల చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ 14 రోజుల వరకు రోజూ ఉదయం టీతోపాటు ఒక్కో రకం అల్పాహారం, మధ్యాహ్నం పప్పు, అన్నం, అరటిపండు, పెరుగు అందించారు. సాయంత్రం టీ, అల్పాహారం, పండ్లు, రాత్రి భోజనం ఇచ్చేవారు. ఆస్పత్రిలో ఉన్న సమయంలో ఒకరినొకరు సరదాగా మాట్లాడుకునేవాళ్లం. వైద్యుల పర్యవేక్షణ ఉండటం, అందరం సానుకూల దృక్పథంతో ఉండటం వల్ల భయం వేసేది కాదు. దీంతో తొందరగానే కోలుకున్నా.

- గద్వాల యువకుడు

వైద్యులు ప్రత్యేకంగా చూసుకున్నారు :

మహబూబ్‌నగర్‌ ఆస్పత్రిలో గత నెలలో సిజేరియన్‌ ద్వారా ప్రసవం అయింది. పుట్టిన పాప అప్పుడే మృతి చెందింది. కొవిడ్‌ లక్షణాలు ఉన్నందున గాంధీ ఆస్పత్రికి పంపించగా పరీక్షల్లో కరోనా సోకినట్లు తేలింది. దీంతో ఆందోళనకు గురయ్యాను. సిజేరియన్‌ కావడం వల్ల వైద్యులు ప్రత్యేకంగా చూసుకున్నారు. ధైర్యంగా ఉండాలి భయపడకూడదని చెప్పేవారు. గాంధీలో దాదాపుగా 10 రోజులపాటు ప్రత్యేక వార్డులో చికిత్స అందించారు. ఆసుపత్రిలో ఉన్న సమయంలో వైద్యుల సూచన, సలహాలతో పౌష్టికాహారం తీసుకున్నా. వేడి నీళ్లను మాత్రమే తాగా. ఉదయం సమయంలో వేడి నీళ్లలో నిమ్మకాయ రసం తీసుకున్నా. ఆహారం వేడిగా ఉన్నప్పుడే తిన్నా. రోగ నిరోధక శక్తి పెరగడానికి పండ్లు ఉపయోగపడ్డాయి. వైద్యుల భరోసా, భర్త సహకారంతో 10 రోజుల్లోనే కోలుకుని సొంత గ్రామానికి వచ్చా. ప్రస్తుతం ఇంట్లో స్వీయ నిర్బంధంలో ఉన్నా.

- మక్తల్‌ మండలానికి చెందిన మహిళ

ఇదీ చదవండి: మిడతల దాడులను 'ప్రకృతి విపత్తు'గా ప్రకటించాలి: కాంగ్రెస్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.