ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కార్ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తుందని భాజపా మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడు ఎర్ర శేఖర్ పేర్కొన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని గతంలో డిమాండ్ చేసిన తెరాస ప్రభుత్వం... అధికారంలోకి వచ్చాక ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. విమోచన దినోత్సవం సందర్బంగా జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన జెండా ఎగరవేశారు.
సర్ధార్ వల్లభాయ్‌పటెల్ ఆధ్వర్యంలో నిజాం రాజు కబంధహస్తాల నుంచి తెలంగాణకు విముక్తి కలిగిందని... సెప్టెంబరు 17 విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్బంగా స్థానిక పారిశుద్ధ్య కార్మికులకు నిత్యవసర సరకులతోపాటు, మాస్కులు, శానిటైజర్లు అందజేశారు.
అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్బంగా పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. స్థానిక ఆనాథ ఆశ్రమంలో చిన్నారులకు శానిటైజర్లు, మాస్కులు, యోగ మ్యాట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు భాజపా నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: 'చరిత్రను విస్మరించే నాయకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'