ETV Bharat / state

నిర్వాసిత గ్రామాలకు పునరావాస ప్యాకేజీ ప్రకటన - నాగర్ కర్నూల్ జిల్లాల్లో నిర్వాసితులకు ఇస్తున్న తరహాలోనే ఆ రెండు గ్రామాలకు పునరావాసం

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తోన్న వీరాంజనేయ జలాశయ నిర్వాసిత గ్రామాలకు రాష్ట్ర ప్రభుత్వం పునరావాస ప్యాకేజీని ప్రకటించింది. సిద్దిపేట, సిరిసిల్ల, నాగర్ కర్నూల్ జిల్లాల్లో నిర్వాసితులకు ఇస్తున్న తరహాలోనే ఆ రెండు గ్రామాలకు పునరావాసం కల్పించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

Government Rehabilitation Package Declaration for the Settlers
నిర్వాసిత గ్రామాలకు ప్రభుత్వం పునరావాస ప్యాకేజీ ప్రకటన
author img

By

Published : Dec 22, 2019, 7:27 AM IST

మహబూబ్‌నగర్ జిల్లాలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తోన్న వీరాంజనేయ జలాశయ నిర్వాసిత గ్రామాలకు రాష్ట్ర ప్రభుత్వం పునరావాస ప్యాకేజీని ప్రకటించింది. సిద్దిపేట, సిరిసిల్ల, నాగర్ కర్నూల్ జిల్లాల్లో నిర్వాసితులకు ఇస్తున్న తరహాలోనే బండ రావిపాకుల, కొంకలపల్లి గ్రామాలకు పునరావాసం కల్పించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

ఇంటి స్థలంతోపాటు
ఒక్కో నిర్వాసిత కుటుంబానికి 250 గజాల ఇంటి స్థలంతోపాటు రెండు పడకగదుల ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలు, పునరావాసం కోసం మరో ఏడున్నర లక్షల రూపాయలు ఇవ్వనున్నారు. 18 ఏళ్లు పైబడిన వారికి ఇంటిస్థలంతో పాటు ఐదు లక్షల రూపాయలు ఇవ్వనున్నారు. బండరావిపాకులలో 729 నిర్వాసిత కుటుంబాలకు, 249 మంది మేజర్లకు, కొంకలపల్లిలో 269 నిర్వాసిత కుటుంబాలకు, 52 మంది మేజర్లకు ఆ పరిహారం అందనుంది. అందుకోసం 140 కోట్ల 19 లక్షల రూపాయల పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించింది.

పదో ప్యాకేజీలో
అటూ కాళేశ్వరం ప్రాజెక్ట్ పదో ప్యాకేజీలో నిర్వాసిత గ్రామమైన ఆనంతగిరిలో మరో 42 కుటుంబాలకు కూడా పరిహరం ప్రకటించింది. మొదట ప్రకటించిన 1135 కుటుంబాల్లోనే వీరు ఉన్నప్పటికీ వేరే కుటుంబాలు అయినందున వారికి కూడా పరిహారం ప్రకటించింది. 42 కుటుంబాల సహాయ, పునరావాసం కోసం మూడు కోట్ల 16 లక్షల రూపాయలు మంజూరు చేసింది.

ఇదీ చూడండి : 'భెల్​ నిర్లక్ష్యంతోనే నత్తనడకన 'యాదాద్రి' నిర్మాణ పనులు'

TG_Hyd_08_22_Rehabilitation_Dry_3053262 From : Raghu Vardhan ( ) పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మిస్తోన్న వీరాంజనేయ జలాశయ నిర్వాసిత గ్రామాలైన బండరావిపాకుల, కొంకలపల్లి గ్రామాలకు రాష్ట్ర ప్రభుత్వం సహాయ, పునరావాస ప్యాకేజీని ప్రకటించింది. సిద్దిపేట, సిరిసిల్ల, నాగర్ కర్నూల్ జిల్లాల్లో నిర్వసితులకు ఇస్తున్న తరహాలోనే ఆ రెండు గ్రామాలకు పునరావాసం కల్పించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒక్కో నిర్వాసిత కుటుంబానికి 250 గజాల ఇంటిస్థలంతో పాటు రెండు పడకగదుల ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలు, పునరావాసం కోసం మరో ఏడున్నర లక్షల రూపాయలు ఇవ్వనున్నారు. 18 ఏళ్ళు పైబడిన వారికి ఇంటిస్థలంతో పాటు ఐదు లక్షల రూపాయలు ఇవ్వనున్నారు. బండరావిపాకులలో 729 నిర్వాసిత కుటుంబాలకు, 249 మంది మేజర్లకు, కొంకలపల్లిలో 269 నిర్వాసిత కుటుంబాలకు, 52 మంది మేజర్లకు పరిహారం అందనుంది. అందుకోసం 140 కోట్లా 19 లక్షల రూపాయల పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. అటు కాళేశ్వరం ప్రాజెక్ట్ పదో ప్యాకేజీలో నిర్వాసిత గ్రామమైన ఆనంతగిరిలో మరో 42 కుటుంబాలకు కూడా పరిహరం ప్రకటించింది. మొదట ప్రకటించిన 1135 కుటుంబాల్లోనే వీరు ఉన్నప్పటికీ వేరే కుటుంబాలు అయినందున వారికి కూడా పరిహారం ప్రకటించింది. 42 కుటుంబాల సహాయ, పునరావాసం కోసం మూడు కోట్లా 16 లక్షల రూపాయలు మంజూరు చేసింది.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.