ETV Bharat / state

గ్రామీణ పేద యువతకు ఉచిత శిక్షణ - Mahabubnagar District Latest News

మహబూబ్​నగర్ జిల్లాలో కేపీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గ్రామీణ పేద యువతకు ఉచిత శిక్షణ ప్రారంభించారు. దేవరకద్ర నియోజకవర్గ పరిధిలోని గ్రామాల వారికి ప్రభుత్వ ఉద్యోగ సాధనలో శిక్షణ ఇస్తున్నారు. వివిధ సబ్జెక్టుల్లో నిపుణులైన అధ్యాపకులతో ఈ శిబిరం నిర్వహిస్తున్నారు.

Free training program for rural poor youth has been started under the auspices of KPR Trust in Mahabubnagar district center
గ్రామీణ పేద యువతకు ఉచిత శిక్షణ
author img

By

Published : Feb 9, 2021, 6:50 PM IST

Updated : Feb 9, 2021, 8:51 PM IST

గ్రామీణ పేద యువతీ యువకులకు ప్రభుత్వ ఉద్యోగ సాధన కోసం మహబూబ్​నగర్ జిల్లాలో కేపీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు. దేవరకద్ర నియోజకవర్గ పరిధిలోని గ్రామాల నిరుద్యోగ యువతకు శిక్షణ ఇస్తున్నారు.

శిక్షణకు వచ్చే వారికి మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పించారు. వివిధ సబ్జెక్టుల్లో నిపుణులైన అధ్యాపకులతో శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నారు. ప్రారంభ కార్యక్రమానికి స్థానిక తహసీల్దార్ జ్యోతి, సర్పంచ్ విజయలక్ష్మితో కలసి జ్యోతి ప్రజ్వలన చేశారు.

పేద యువతీ యువకులకు ఉచిత శిక్షణ అందించడంపై ట్రస్ట్ నిర్వాహకులను పట్టణవాసులు అభినందించారు. కార్యక్రమంలో కేపీఆర్ ట్రస్ట్ నిర్వాహకుడు కొండ ప్రశాంత్ రెడ్డి, అధ్యాపకులు, పలు గ్రామాల నుంచి వచ్చిన యువత పాల్గొన్నారు.

ఇదీ చూడండి: పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల

Last Updated : Feb 9, 2021, 8:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.