ఆడపడుచులు ఆనందంగా పండగలను జరుపుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ.. చీరలు పంపిణీ చేస్తున్నట్లు ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో పలు వార్డులలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో మహిళలకు బతుకమ్మ చీరలను అందజేశారు. జిల్లాలో 2 లక్షల చీరలు పంపిణీకి శ్రీకారం చుట్టామన్నారు. బతుకమ్మతో పాటు దసరా పండగ వస్తుండడం.. ఇప్పటికే పెరిగిన పింఛన్లు అందుతుండడం వల్ల ప్రజలు ఆనందంగా పండుగలను జరుపుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనుందని పేర్కొన్నారు.
ఇదీచూడండి:'104 సిబ్బంది సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది'