మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలోని జాతీయ రహదారిపై రైతులు రాస్తారొకో నిర్వహించారు. ఆముదాలకు సరైన మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. గత వారం వరకు క్వింటా ఆముదాలకు గరిష్టంగా రూ. 5200 వరకు ఉండగా... ప్రస్తుతం రూ.3900 నుంచి 4200 వరకు మాత్రమే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు వెయ్యి రూపాయలు తగ్గించడం సరికాదని చెప్పారు. అన్నదాతల ఆందోళనతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. రంగప్రవేశం చేసిన పోలీసులు ఆందోళనను విరమించాలని కోరారు. ఎంతచెప్పినా వినకపోవడం వల్ల ప్రత్యేక పోలీసు బలగాలను రప్పించి రైతులను మార్కెట్ వర్గాలతో మాట్లాడించారు. అనంతరం పోలీసులు వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.
ఇవీ చూడండి: జంటనగరాల్లో భారీవర్షం... ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం