ప్రతి గ్రామానికి ఏడాదికి కోటి రూపాయలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మహబూబ్‌నగర్ హన్వాడ గ్రామసభకు మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి హాజరయ్యారు. శ్రమదానం చేసిన మహిళ సంఘాలకు 50వేల నుంచి 3 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందజేయనున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో గ్రామాల స్వరూపాలు మారుతున్నాయన్నారు.
ఇవీచూడండి: 'ప్రతీ ఒక్కరూ గాంధీ చూపిన మార్గంలోనే నడవాలి'