రైతులకు సంబంధించిన భూ వివరాలతో పాటు పంటలు, వ్యవసాయ పరికరాలు, ఆధార్ సంఖ్యతో, చారవాణి నెంబర్లతో భారీ డేటా బేస్‌ను తయారు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి తెలిపారు. సాంకేతికతను సమకూర్చుకుని దేశంలో ఎక్కడాలేని విధంగా భారీ సర్వే నిర్వహిస్తున్నామని వెల్లడించారు. వ్యవసాయానికి సంబంధించిన మాస్టర్ "కీ" ని తయారు చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి రైతుకు మద్దతు ధర ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, ఇందుకనుగుణంగా మార్పులు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఇవీ చూడండి : పిచ్చికుక్క దాడిలో 48 మందికి గాయాలు