మహబూబ్నగర్జిల్లాలో తాజాగా మరో నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పట్టణానికి చెందిన ఓ మహిళతో పాటు గండీడ్ మండలానికి చెందిన మరో మహిళకు హైదరాబాద్‌లో శస్త్ర చికత్స జరిగింది. కొవిడ్- 19 పరీక్ష నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా తేలింది.
భూత్పూర్ మండలంలోని ఓ గ్రామంలో ఇటీవల నమోదైన రెండు కరోనా పాజిటివ్ కేసులకు సంబంధించి ప్రైమరీ కాంట్రాక్టులకు పరీక్షలు నిర్వహించగా.. మరో ఇద్దరికి వైరస్ ఉన్నట్లుగా నిర్ధరించారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరికి ఇది వరకే పాజిటివ్ రాగా... ఇప్పుడు మరో ఇద్దరికి పాజిటివ్‌గా వచ్చింది. జిల్లా కేంద్రంలో మరొకరికి వ్యాధి నిర్ధరణ అయింది. జిల్లాలో క్రియాశీలంగా ఉన్న మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య పదికి చేరింది.
జిల్లాలోని మొత్తం కేసులు..
ప్రస్తుతం ఎస్వీఎస్ ఐసోలేషన్ వార్డులో 6 మంది, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో 28 మంది వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఇతర రాష్ట్రాలు, ఇతర జిల్లాల నుంచి 17వేల 552 మంది రాగా.. 15వేల 229 మంది 14 రోజుల హోం క్వారంటైన్ పూర్తి చేసుకున్నారు. మరో 2,222 మంది హోం క్వారంటైన్లో కొనసాగుతున్నారు. జిల్లా వ్యాప్తంగా అనుమానితులను ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారి ప్రైమరి కాంట్రాక్టులను గుర్తిస్తున్నారు.
ఇదీ చూడండి: కొన్నింటికి అనుమతుల్లేవ్.. కంటైన్మెంట్లో కఠినం..