ETV Bharat / state

ఉమ్మడి పాలమూరు జిల్లాపై కరోనా పంజా!

ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలో కరోనా మరోసారి పంజా విసిరింది. శుక్రవారం ఒక్కరోజే ఉమ్మడి జిల్లాలో 16 కేసులు నమోదు కాగా.. ఇద్దరు గాంధీలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లా నుంచి ప్రత్యేక జిల్లాగా ఏర్పడిన జిల్లాల్లో నమోదైన కరోనా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.

Corona Positive Cases Increased In Mahabub Nagar
మహబూబ్​నగర్​పై కరోనా పంజా!
author img

By

Published : Jun 28, 2020, 10:18 AM IST

మహబూబ్​నగర్ జిల్లాలో శుక్రవారం ఏడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్యతో మహబూబ్​నగర్ జిల్లాలో ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 80కి చేరింది. వీరిలో 11 మంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో, నలుగురు ప్రైవేటు ఆసుపత్రుల్లో, 35మంది హోం ఐసోలేషన్​లో ఉన్నారు. 15మంది హోంఐసోలేషన్ పూర్తి చేసుకోగా.. 12మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇద్దరు చనిపోయారు. దేవరకద్ర మండంలం డోకూరు గ్రామానికి చెందిన వృద్ధుడు కరోనాకు చికిత్స పొందుతూ శుక్రవారం నాడు గాంధీ ఆస్పత్రిలో ప్రాణాలు విడిచారు. కరోనా కేసుల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం.. 29 కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేశారు. తాజాగా నమోదైన ఐదు కేసుల్లో మహబూబ్​నగర్ పట్టణానికి చెందిన ఏనుగొండలో ఒకరు, ఎదిరలో ఒకరు, పుట్నాలపట్టిలో ఒకరు, హౌజింగ్ బోర్డులో ఒకరు, మర్లులో ఒకరు, నవాబుపేట మండలం కొల్లూరులో ఒకరు, బాలనగర్ మండలంలో ఒకరు కరోనా బారిన పడ్డారు. వీరిలో 108 వాహన డ్రైవర్, హైదరాబాద్​లో పనిచేసే కానిస్టేబుల్ ఉన్నారు.

నాగర్ కర్నూల్ జిల్లాలో..

నాగర్ కర్నూల్ జిల్లాలో తాజాగా నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో నాగర్ కర్నూల్ ప్రభుత్వాసుపత్రిలో ఓ స్టాఫ్ నర్సు, పాలెంలో బ్యాంకులో పనిచేసే ఓ ఉద్యోగి, పెద్దకొత్తపల్తి మండలంలో నివాసం ఉండే ఓ హోంగార్డు ఉన్నారు. కల్వకుర్తిలో ఓ మహిళకు కరోనా పాజిటివ్​ నిర్ధారణ అయింది. వీరికి సంబంధించిన ప్రైమరీ కాంటాక్టులను గుర్తించి.. హోం క్వారంటైన్ చేశారు.

నారాయణపేట జిల్లాలో..

నారాయణపేట జిల్లాలో తాజాగా రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసులతో పాజిటివ్ కేసుల సంఖ్య 12కు చేరింది. నారాయణపేట మండలం సింగారం గ్రామానికి చెందిన ఓ వృద్ధుడు అనారోగ్యం బారిన పడగా.. అతన్ని హైదరాబాద్​లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతున్నట్టు తెలుసుకున్న వైద్యులు పరీక్షలు నిర్వహించగా కరోనా ఉన్నట్లు తేలింది. ఆ వృద్ధుడు గాంధీలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వృద్ధుడి మరణంతో జిల్లాలో కరోనా మృతుల సంఖ్య మూడుకు చేరింది. మక్తల్ మండలం కర్నె గ్రామానికి చెందిన ఒకరికి కరోనా సోకినట్లుగా అధికారులు ధ్రువీకరించారు. మొత్తం 12 పాజిటివ్ కేసులు నమోదు కాగా..7 కేసులు అక్టివ్ గా ఉన్నాయి. ఇద్దరు కోలుకున్నారు.

వనపర్తి జిల్లాలో..

వనపర్తి జిల్లాలో కొత్తగా ఒక కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. ఖిలా గణపురం మండలంలో పనిచేసే ఓ అటవీ శాఖ అధికారికి కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయింది. హైదరాబాద్​లో రెండు రోజుల కిందట పరీక్షలు చేయించుకోగా.. ఫలితాల్లో కరోనా సోకినట్లుగా తేలిందని జిల్లా వైద్యాధికారి శ్రీనివాసులు వెల్లడించారు. తొమ్మిదిమంది ప్రైమరీ కాంట్రాక్టులను గుర్తించి హోం క్వారంటైన్ చేశారు.

జోగులాంబ గద్వాల జిల్లాలో..

జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన ఇద్దరికి కరోనా సోకినట్లుగా జిల్లా వైద్యాధికారి మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఐజ గ్రామానికి చెందిన ఒకరికి, గద్వాల పట్టణం రెండో రైల్వే గేటు ప్రాంతానికి చెందిన ఇంకొకరికి కరోనా పాజిటివ్​ నిర్ధారణ అయింది. అనారోగ్యంతో హైదరాబాద్ కు వెళ్లగా అక్కడ నిర్వహించిన పరీక్షల్లో వారికి కరోనా ఉన్నట్లుగా తేలింది. గద్వాల ప్రభుత్వాసుపత్రిలో ఇవాళ 11 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. రేపు ఫలితాలు రావాల్సి ఉంది. శుక్రవారం పరీక్షలు నిర్వహించిన నలుగురికి నెగెటివ్ వచ్చిందని వైద్యాధికారులు వెల్లడించారు.

ఇదీ చదవండి: ప్రభుత్వ భూముల పరిరక్షణకు కఠినంగా వ్యవహరిస్తాం: మంత్రి కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.