మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటక కేంద్రాలలో ఒకటైన కోయిల్ సాగర్ ప్రాజెక్ట్‌ను సందర్శించేందుకు జిల్లా నలుమూలల నుంచి అత్యధికంగా వస్తుంటారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో... కోయిల్ సాగర్ ప్రాజెక్టు పరిధిలో ఉన్న బొల్లారం గ్రామస్థులకు కరోనా సోకే అవకాశం ఉంది. అయితే పర్యాటకులకు అనుమతి ఇచ్చేందుకు నిరాకరించారు.

స్థానిక పోలీసులు సైతం పంచాయతీ తీర్మానాన్ని గౌరవిస్తూ.. పర్యాటకులు కోయిల్‌సాగర్ ప్రాజెక్టు సందర్శనకు రాకుండా గ్రామ సమీపంలోనే బారికేడ్లను ఏర్పాటు చేశారు. కోయిల్ సాగర్ సందర్శించాలనుకున్నా... పర్యాటకులకు కరోనా ప్రభావంతో సాగర్ పరవళ్లు చూసే అవకాశం లేకుండా పోయింది.
ఇదీ చదవండి: ఫేస్బుక్ సీఈఓకు కాంగ్రెస్ లేఖ, శివసేన గరం!