పెరుగుతున్న కొవిడ్ కేసులతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. జులై 27న ఉమ్మడి జిల్లాలో 99 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహబూబ్ నగర్ జిల్లాలో ఒక్కరోజే 29మంది కరోనా బారిన పడ్డారు. నాగర్ కర్నూల్ జిల్లాలో 9, నారాయణపేట జిల్లాలో 14, వనపర్తి జిల్లాలో 3 కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా.. మహబూబ్ నగర్, వనపర్తి జిల్లాల్లో కలిపి రెండు కొవిడ్ మరణాలు నమోదయ్యాయి.
జోగులాంబ గద్వాల జిల్లాలో అధికంగా 44 మందికి పాజిటివ్ వచ్చింది. పరీక్షల్లో 10 మందికి కరోనా ఉన్నట్టు బయటపడగా.. ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షల్లో 34 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇందులో గద్వాల పట్టణానికి చెందిన వారు 25 మంది ఉండగా, అలంపూర్ పరిధిలో నలుగురు, అయిజ పరిధిలో నలుగురు, రాజోలిలో ఒక్కరు కరోనా బారిన పడ్డారు.
మహబూబ్‌నగర్ జిల్లాలో 29 పాజిటివ్ కేసులు రాగా... పురపాలిక పరిధిలోనే 22 మంది వైరస్ బారిన పడ్డారు. జడ్చర్ల పట్టణానికి చెందిన ముగ్గురు, భూత్పూర్ మండలం కప్పెటలో, అడ్డాకులలో, హన్వాడ మండలం గిండ్యాలలో ఒక్కొటి చొప్పున కరోనా నిర్ధారణ అయ్యింది. హన్వాడ మండల కేంద్రానికి చెందిన వ్యక్తి కొవిడ్ లక్షణాలతో మృతి చెందారు.
నారాయణపేట జిల్లాలో 14 మంది కరోనా బారిన పడగా.. జిల్లా కేంద్రంలో 6, నారాయణపేట మండలంలో 1, మద్దూర్ మండలంలో 3, కోస్గి మండలంలో 4 కరోనా కేసులు నమోదయ్యాయి.
వనపర్తి జిల్లాలో ముగ్గురికి కరోనా పాజిటివ్ రాగా... పట్టణంలో ఇద్దరికి, మదనాపురం మండలంలో ఒకరికి కొవిడ్ సోకింది. పాజిటివ్ లక్షణాలతో వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన ఓ మహిళ మృతి చెందింది.
నాగర్ కర్నూల్ జిల్లాలో 9 మంది కరోనా బారిన పడగా.. అందులో ముగ్గురు పెద్ద కొత్తపల్లి మండలానికి చెందిన వారుగా అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి : 'సచివాలయ కూల్చివేత ఎలా జరుగుతోంది.. వ్యర్థాల పరిస్థితి ఏంటి?'