ETV Bharat / state

మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ హత్యకు కుట్ర - మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ తాజా వార్తలు

minister Srinivas goud
minister Srinivas goud
author img

By

Published : Mar 2, 2022, 8:01 PM IST

Updated : Mar 2, 2022, 8:48 PM IST

19:58 March 02

మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ హత్యకు కుట్ర

minister Srinivas goud : మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ హత్యకు కుట్ర జరిగినట్లు సైబరాబాద్​ పోలీసులు వెల్లడించారు. మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, ఆయన సోదరుడు శ్రీకాంత్‌ హత్యకు సుపారీ గ్యాంగ్​తో కుట్రపన్నినట్లు తెలిపారు. అయితే మంత్రి హత్య కుట్రను భగ్నం చేసి.. నలుగురిని అరెస్ట్​ చేసినట్లు చెప్పారు.

మహబూబ్​నగర్​కు చెందిన యాదయ్య, విశ్వనాథ్‌, నాగరాజు.. సుపారీ గ్యాంగ్​తో హత్య చేయాలని భావించినట్లు పోలీసులు తెలిపారు. ఇందుకోసం ఫరూక్​ అనే వ్యక్తికి సుపారీ ఇచ్చేందుకు యత్నించారు. అయితే ఈ విషయాన్ని ఫరూక్.. పేట్​బషీరాబాద్​ పోలీసులు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. యాదయ్య, విశ్వనాథ్‌, నాగరాజును అరెస్టు చేశారు. అనంతరం దర్యాప్తు చేపట్టారు.

నిందితుల్లో ఒకరైన నాగరాజు ఇచ్చిన సమాచారంతో.. దిల్లీలోని భాజపా నేత జితేందర్‌ రెడ్డి నివాసంలో రఘును అరెస్ట్​ చేశారు. రఘుకు ఆశ్రయం ఇచ్చిన మరో ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు. విచారించిన అనంతరం ముగ్గురినీ విడిచిపెట్టారు. హత్య కుట్ర కోణాన్ని దిల్లీ పోలీసులకు సైబరాబాద్‌ పోలీసులు తెలియజేశారు.

ఇదీచూడండి: భాజపా నేత ఇంట్లో కిడ్నాప్​ కలకలం.. డ్రైవర్ సహా నలుగురి అపహరణ

Last Updated : Mar 2, 2022, 8:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.