ఈ నెల 29న మహబూబ్‌నగర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభ ఉండటం వల్ల ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. మంతనాల సందర్భంగా జితేందర్ రెడ్డి కొన్ని డిమాండ్లు చేసినట్లు తెలిసింది. వీటిపై భాజపా అగ్రనాయకులతో మాట్లాడి చెబుతానని రాంమాధవ్ తెలిపారు. సంప్రదింపులు సఫలమైతే జితేందర్‌రెడ్డి 29న భాజపాలో చేరే అవకాశముంది.
1999 లోక్‌సభ ఎన్నికల్లో మహబూబ్నగర్ నుంచి భాజపా అభ్యర్థిగా గెలిచారు. ఆ తర్వాత తెదేపాలో, అనంతరం తెరాసలో చేరారు. 2014లో మహబూబ్నగర్ నుంచి తెరాస అభ్యర్థిగా బరిలో దిగి విజయం సాధించారు. జితేందర్‌రెడ్డితో రాంమాధవ్ సంప్రదింపులను భాజపా వర్గాలు ధ్రువీకరించాయి. జితేందర్ రెడ్డి మాత్రం అలాంటిదేం లేదని పార్టీ మారే అవకాశముంటే చెబుతానని తెలిపారు.
ఇదీ చదవండి :11 లోక్‌సభ స్థానాలు.... 36 సభలు, రోడ్ షోలు