కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి సమరసింహా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ పాల్గొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏడాదికి ప్రతి పేద కుటుంబానికి రూ.72 వేలు నేరుగా అర్హుల ఖాతాల్లో జమ అవుతాయని అభ్యర్థి మల్లు రవి తెలిపారు. భాజపా ధనికుల పార్టీ అని.... కాంగ్రెస్ రైతుల పక్షపాతి అని అభివర్ణించారు.కాంగ్రెస్ పార్టీ విజయానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని నేతలు సూచించారు.
ఇవీ చూడండి:పేదలకు ఏటా రూ.72వేల నగదు బదిలీ : రాహుల్