శ్రీశైలం అగ్నిప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు మంత్రి జగదీశ్‌రెడ్డి పరిహారం ప్రకటించారు. డీఈ శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు రూ.50 లక్షలు, ఇతర మృతుల కుటుంబ సభ్యులకు రూ.25 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని వెల్లడించారు. మృతుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ ఆదేశం మేరకు పరిహారం ప్రకటించామని మంత్రి జగదీశ్‌రెడ్డి చెప్పారు. పూర్తిగా వారి కుటుంబాలకు అండగా ఉంటామని మంత్రి అన్నారు. విధి నిర్వహణలో అమరులైన కుటుంబాలకు సంతాపం ప్రకటించారు.
శ్రీశైలం జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రంలోని ప్యానెల్స్‌లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో ప్రమాదం జరిగిందని విద్యుత్ శాఖ ప్రకటించింది. ఘటనలో 9 మంది మృతిచెందినట్లు స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఏడుగురి మృతదేహాలు వెలికితీయ్యగా.. మిగతా ఇద్దరి మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది బయటకు తీసుకువస్తున్నారు.
ఇదీ చూడండి : వ్యర్థాలతో కరెంట్ ఉత్పత్తి.. విద్యుత్ శాఖ శ్రీకారం