పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద చేపడుతున్న భూసేకరణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ఎస్. వెంకట్రావు అధికారులను ఆదేశించారు. ఉదండాపూర్ రిజర్వాయర్ కు సంబంధించి అవార్డుల చెల్లింపులు, అప్పనపల్లి రైల్వే బ్రిడ్జ్ భూసేకరణ పనులు, జడ్చర్ల, నవాబ్ పేట మండలాలలో జరుగుతున్న భూసేకరణ పనులపై క్యాంపు కార్యాలయం నుంచి రెవిన్యూ, ఇంజినీరింగ్ అధికారులు, తహసీల్దారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
ఎల్‌ఆర్‌యూపీలో తప్పిపోయిన మ్యుటేషన్‌లతో పాటు అటవీ శాఖకు సంబంధించిన భూసేకరణపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. అనంతరం పనిచేసే చోట మహిళలపై లైంగిక వేధింపుల చట్టంపై జిల్లా అధికారులతో పాటు మండల స్థాయి అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు జిల్లా స్థాయి మొదలుకొని మండల స్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.