మహబూబ్‌నగర్ జిల్లాలో హరితహారం కార్యక్రమంలో భాగంగా కోటి విత్తన బంతులను తయారు చేసి వెదజల్లేందుకు నిర్ణయించింది జిల్లా యంత్రాంగం. అనుకున్నదే తడువుగా.. పాలమూరు జిల్లా మహిళా సంఘాల ఆధ్వర్యంలో కోటి విత్తన బంతుల తయారీ పూర్తి చేసి.. వాటిన వెదజల్లడం ప్రారంభించింది.
మూడు రోజులుగా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ కార్యక్రమాన్ని రెండు రోజులు పొడగించారు. దీంతో లక్ష్యానికి మించి విత్తన బంతులను వెదజల్లినట్లు కలెక్టర్ వెంకట్రావు తెలిపారు.
జిల్లాలోని 15 మండలాల్లో కోటి 14 లక్షల 88 వేల 61 బంతులను తయారు చేయగా, మంగళవారం నాటికి తయారు చేసిన మొత్తం విత్తన బంతులను ప్రభుత్వ భూములు, కొండలు, అడవులు, గుట్టలలో వెదజల్లినట్లు కలెక్టర్ వెల్లడించారు. చివరి రోజు నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 1430 కరోనా కేసులు.. ఏడుగురు మృతి