మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్గా బదిలీపై వచ్చిన వెంకటరావు బాధ్యతలు స్వీకరించారు. నారాయణపేట కలెక్టర్గా ఉంటూ బదిలీపై మహబూబ్ నగర్ పాలనాధికారిగా నియమితులయ్యారు.
కలెక్టర్ క్యాంపు కార్యాలయం లో జిల్లా అధికారుల సమక్షంలో బాధ్యతలను స్వీకరించారు. ఇప్పటివరకూ జిల్లా కలెక్టర్గా ఉండి... బదిలీపై ఆర్థిక శాఖ కార్యదర్శిగా వెళ్తున్న రోనాల్డ్ రోస్... నూతన పాలనాధికారి వెంకట్ రావుకు బాధ్యతలు అప్పగించారు.
ఇదివరకు ఇక్కడ సంయుక్త కలెక్టర్గా పనిచేసిన అనుభవం ఉండటం వల్ల పాలనను మరింత అభివృద్ధిలోకి తీసుకువెళ్లేందు కృషి చేస్తానని వెంకటరావు తెలిపారు.