ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం ఇవ్వకుండా.. అన్నదాతలను జైల్లో పెట్టిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి మండిపడ్డారు. మహబూబ్నగర్లో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి విద్యా, వైజ్ఞానిక, రాజకీయ శిక్షణ తరగతులను ప్రారంభించారు. భూసేకరణకు సంబంధించి ఎక్కడెక్కడ ఎంత పరిహారం చెల్లించారో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కుడికిళ్లలో రైతులపై పోలీసుల దాడి అమానుషమైన చర్యగా అభివర్ణించారు. యురేనియం తవ్వకాలపై కేసీఆర్ వైఖరి ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. నల్లమలలో యురేనియం తవ్వకాలు జరిపితే అగ్నిగుండమే అవుతుందని హెచ్చరించారు.
ఇవీ చూడండి: కుషాయిగూడ చోరీ కేసు.. బిహార్లో నలుగురు దొంగల అరెస్ట్