ETV Bharat / state

'ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేసిన సీఎం కేసీఆర్' - కేసీఆర్​పై మండిపడ్డ తరుణ్ చుగ్

కేసీఆర్ నిజ స్వరూపాన్ని భాజపా శ్రేణులు ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలని భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ తరుణ్ చుగ్ విజ్ఞప్తి చేశారు. జడ్చర్ల పుర ఎన్నికల సందర్భంగా పట్టణంలో ఏర్పాటు చేసిన భాజపా కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరయ్యారు. హామీలు నెరవేర్చని సీఎంల్లో కేసీఆర్​ మొదటి స్థానంలో ఉంటారని ఆయన ఎద్దేవా చేశారు.

Tarun Chugh jadcherla election campaign, Tarun Chugh latest news
'ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేసిన సీఎం కేసీఆర్'
author img

By

Published : Apr 24, 2021, 10:01 PM IST

తెరాస పాలన నుంచి తెలంగాణ ప్రజలు విముక్తి కోరుకుంటున్నారని, పురఎన్నికల్లో అధికార పార్టీని ఓడించడంతో తెరాస పాలన అంతానికి నాంది పలకాలని భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ తరుణ్ చుగ్ అన్నారు. జడ్చర్ల పుర ఎన్నికల సందర్భంగా పట్టణంలో ఏర్పాటు చేసిన భాజపా కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన రెండు పడక గదుల ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి, కేజీ నుంచి పీజీ ఉచిత విద్య సహా అన్ని వాగ్దాలను కేసీఆర్ తుంగలో తొక్కారని ఆరోపించారు.

హామీలు నెరవేర్చని ముఖ్యమంత్రుల్లో కేసీఆర్​ నంబర్ వన్ అన్నారు. కరోనా విళయ తాండవం చేస్తున్న వేళ పాఠశాలలు తెరచుకోవడం లేదు, కానీ మద్యం దుకాణాలు మాత్రం నడుస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతుందని వ్యాఖ్యానించారు. ప్రజల ఆరోగ్యాన్ని కేసీఆర్ సర్కారు గాలికి వదిలేసిందని బీసీ కమిషన్ సభ్యుడు ఆచారి ఆరోపించారు.

కేంద్రం ఇచ్చే నిధులతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయన్న ఆయన... భాజపాను గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తామని చెప్పారు. జడ్చర్లలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఓటర్లను బెదిరించడం సరికాదని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. జడ్చర్లలో భాజపాకు ఒక్క అవకాశం ఇచ్చి చూడాలని ఆమె ఓటర్లను అభ్యర్థించారు.

ఇదీ చూడండి : ఓరుగల్లులో 40 సీట్లకు పైగా గెలవబోతున్నాం: బండి సంజయ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.