ETV Bharat / state

bjp leaders stormed the SP office: ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడించిన భాజపా కార్యకర్తలు - మహబూబ్​నగర్​లో ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడించిన భాజపా వార్తలు

bjp leaders stormed the SP office: మహబూబ్​నగర్ పట్టణంలో ప్రశ్నించే గొంతుకలపై అక్రమ కేసులు, అరెస్ట్​లకు నిరసనగా భాజపా నేతలు ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడించారు. మంత్రి శ్రీనివాస్​ గౌడ్​కు వ్యతిరేకంగా పోరాడుతున్న వారిపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని భాజపా జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారి ఆరోపించారు.

bjp leaders stormed the SP office at mahabubnagar
మహబూబ్​నగర్​లో ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడించిన భాజపా నేతలు
author img

By

Published : Mar 2, 2022, 6:33 PM IST

bjp leaders stormed the SP office: మహబుబ్​నగర్​లో కొనసాగుతున్న అక్రమ అరెస్టులకు నిరసనగా భాజపా కార్యకర్తలు ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న వాళ్లను ఒక్కొక్కరుగా అరెస్ట్ చేస్తున్నారని ఆందోళన చేపట్టారు. మరో 25 మంది పైన కేసులు పెడతామని పోలీసులు చెబుతున్నారని భాజపా జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారి ఆరోపించారు.

ఇలా చేస్తూ పోతే ప్రశ్నించే గొంతుకలే పాలమూరులో వినిపించవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దిల్లీలో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి అతిధిగృహం నుంచి వ్యక్తులను అపహరించడాన్ని తీవ్రంగా ఖండించారు . మంత్రి తక్షణం కక్ష సాధింపు చర్యలను మానుకోవాలని వీరబ్రహ్మచారి డిమాండ్ చేశారు.

ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడించిన భాజపా కార్యకర్తలను అదుపులోకి తీసుకొన్నారు. కమలం కార్యకర్తలు ప్రతిఘటించడంతో.. కాసేపు ఉద్రిక్తత నెలకొంది.

ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడించిన భాజపా కార్యకర్తలు

ఇదీ చదవండి: Mahabubnagar Kidnaps: పాలమూరులో అపహరణల అలజడి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.