ETV Bharat / state

Jitender Reddy On Kcr: మీకు దమ్ముంటే రిటైర్డ్​ జడ్జితో విచారణ జరిపించండి: జితేందర్​ రెడ్డి - మహబూబ్​నగర్​లో జితేందర్​ రెడ్డి

తాను తప్పు చేసినట్లు తేలితే జైలుకెళ్లేందుకైన సిద్ధంగా ఉన్నానని భాజపా నేత, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి అన్నారు. తెరాస వ్యతిరేక విధానాలు, పాలమూరులో జరుగుతున్న అక్రమ నిర్భందాలకు నిరసనగా చేపట్టిన మహాధర్నాలో జాతీయ బీసీ కమిషన్‌ సభ్యుడు ఆచారితో కలిసి ఆయన పాల్గొన్నారు.

Jitender Reddy On Kcr
భాజపా నేత, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి
author img

By

Published : Mar 5, 2022, 7:54 PM IST

తన మీద వచ్చిన ఆరోపణలపై రిటైర్డ్​ జడ్జితో విచారణ జరిపించాలని భాజపా నేత, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. తప్పు చేసినట్టు తేలితే జైలుకు వెళ్లేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. తెరాస ప్రజా వ్యతిరేక విధానాలు, పాలమూరులో జరుగుతున్న అక్రమ నిర్బంధాలపై నిరసనగా చేపట్టిన మహాధర్నాలో జాతీయ బీసీ కమిషన్‌ సభ్యుడు ఆచారితో కలిసి పాల్గొన్నారు.

ఎందుకు చంపాలనుకున్నారో వాళ్లే చెప్పాలి

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న అభ్యర్థులు సైతం తెరాసకు చెందిన వారేనని జితేందర్ రెడ్డి ఆరోపించారు. ఏయే కారణాలతో వారు హత్య చేయాలనుకున్నారో మంత్రే బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. నన్ను బద్నాం చేసి సానుభూతితో మళ్లీ గెలవాలని అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

కావాలనే నాపై ఆరోపణలు

నాపై కావాలనే ఆరోపణలు చేస్తున్నారని.. దీనిపై ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదని జితేందర్​ రెడ్డి హెచ్చరించారు. తెరాసకు చెందిన యువకులు తన ఇంటిపై రాళ్లు రువ్వినా పోలీసులు అక్కడే ఉండి తమాషా చూశారని మండిపడ్డారు. ఆ దృశ్యాలు తమ వద్ద ఉన్నాయని వెల్లడించారు. పోలీసులను చూసి ప్రజలు సిగ్గుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీకి వంత పాడుతున్న వారిపై ఎప్పటికైనా చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతకుముందు రాళ్ల దాడిలో ధ్వంసమైన తన ఇంటిని భాజపా నాయలకులతో కలిసి జితేందర్‌రెడ్డి పరిశీలించారు.

సీఎం కేసీఆర్​ గారిని ఒకటే అడుగుతున్నా. ఇన్ని అభాండాలు మామీద వేస్తున్నవే. జైలు వెళ్లేందుకు మేం రెడీగా ఉన్నాం. సీబీఐ ఎంక్వైరీ మీద నమ్మకం లేకపోతే రిటైర్డ్​ జడ్జితో విచారణ జరిపించు. శ్రీనివాస్ గౌడ్​ను ఎందుకు హత్య చేస్తరు? ఎవరు చేస్తరు? ఎందుకు చంపాలనుకుంటారు? ఒకర్ని బద్నాం చేస్తే మళ్లీ నేనే గెలుస్తామనుకోవచ్చు. మహబూబ్​నగర్​లో లక్షమందితో సర్వే చేస్తే ఇది ఫేక్ అని తేలింది. సీఎంగారు మీరు ఆలోచించండి. నా ఇంటిపై రాళ్లు వేస్తుంటే పోలీసులు తమాషా చూస్తుర్రు. ఇదేనా మీరు చేసే పని. మా నాన్న కూడా పోలీసే. మిమ్మల్ని చూసి ప్రజలు సిగ్గుపడుతున్నారు. ఆ పరిస్థితి ఎందుకొచ్చింది. నిజంగా నేను తల్చుకుంటే దిల్లీలో ఫిర్యాదు చేస్తే ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించుకోండి. - జితేందర్ రెడ్డి, మాజీ ఎంపీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.