ETV Bharat / state

దళిత బంధులో భారీ అక్రమాలు.. లబ్దిదారుల నుంచి లక్షల్లో దోపిడీ!

Massive Irregularities in Dalit bandhu Scheme: నాగర్‌కర్నూల్ జిల్లా చారగొండలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన.. దళిత బంధు పథకంలో భారీగా అక్రమాలు జరిగినట్లు లబ్దిదారులు ఆరోపిస్తున్నారు. రూ.10 లక్షల విలువైన యూనిట్లు పొందాల్సిన చోట జీఎస్టీ, రవాణా, అధిక ధరల పేరిట రెండు నుంచి మూడు లక్షలు దోచుకున్నారని లబ్దిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని ఆందోళన చెందుతున్నారు. కొందరు ప్రజాప్రతినిధులు నిబంధనలకు విరుద్దంగా తమ ఖాతాల్లోకి ఆ డబ్బు మళ్లించుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Dalit bandhu Scheme
Dalit bandhu Scheme
author img

By

Published : Mar 9, 2023, 9:59 AM IST

దళిత బంధులో భారీ అక్రమాలు.. లక్షల్లో దోచుకుంటున్నారని లబ్దిదారుల ఆవేదన

Massive Irregularities in Dalit bandhu Scheme: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న దళిత బంధు పథకం క్షేత్రస్థాయిలో అభాసుపాలు అవుతోంది. నాగర్‌కర్నూల్ జిల్లా చారగొండలో పైలట్‌ ప్రాజెక్టుగా చేపట్టిన దళిత బంధులో అక్రమాలు చోటు చేసుకున్నాయి. మండలానికి 1708 యూనిట్లు మంజూరుకాగా.. ఇప్పటివరకి 1601 యూనిట్లు లబ్దిదారులకు చేరాయి.

రూ.10 లక్షలు విలువైన యూనిట్లు లబ్దిదారులకు అందాల్సి ఉండగా.. వారికి 7 నుంచి రూ.8 లక్షలు విలువైన వస్తువులు మాత్రమే చేతికి అందుతున్నాయి. చారగొండలో రూ.10 లక్షల విలువైన యూనిట్‌కు జీఎస్టీ 18 శాతం, రవాణా 20 వేలు, కమిషన్ కింద కొంత మొత్తం మినహాయించుకొని మిగిలిన డబ్బులకే యూనిట్లు మంజూరు చేశారని లబ్దిదారులు ఆరోపిస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో ఉన్న ధరల కంటే అధిక ధరకు పనిముట్లు, సరుకులిచ్చారని, వాటిని అమ్ముకోలేక పోతున్నామని వాపోతున్నారు.

ఏజెన్సీలు ఇష్టానుసారం దోపిడికి పాల్పడుతున్నాయి: మంజూరైన డబ్బుకు యూనిట్లు ఇవ్వాల్సిన ఏజెన్సీలు ఇష్టానుసారం దోపిడికి పాల్పడుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. దళితబంధు కోసం మంజూరైన డబ్బులు లబ్దిదారు ఖాతా నుంచి యూనిట్ అమ్మిన సంస్థకే జమకావాలి. కానీ.. ఓ తండా సర్పంచి తల్లి బ్యాంకు ఖాతాలోకి ఏడుగురి లబ్దిదారుల డబ్బులు జమయ్యాయి. సర్పంచి మేనేత్త కుమారుడి ఖాతాలోకి ఐదుగురి డబ్బులు వెళ్లాయి.

అక్రమాలపై పూర్తిస్థాయి విచారణ జరిపాలి: ఆ 12 మంది క్షేత్రస్థాయిలో యూనిట్లు ప్రారంభించలేదు. కొందరు యూనిట్లు ఏర్పాటు చేయకపోయినా, ఫోటోలు మాత్రం ఏర్పాటు చేసినట్లు తప్పుడు పత్రాలు సృష్టించి.. లబ్దిపొందినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కానీ అధికారులు మాత్రం నిబంధనల మేరకే యూనిట్లు మంజూరు చేశామని చెబుతున్నారు. అక్రమాలపై పూర్తిస్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

చారగొండలో వెలుగుచూస్తున్న దళిత బంధు అక్రమాల్లో ప్రజాప్రతినిధులు, ట్రేడింగ్‌ ఏజెన్సీలు, అధికారులు కీలకంగా వ్యవహరించినట్లు ప్రచారం సాగుతోంది. మోసపోయిన లబ్దిదారుల ఫిర్యాదులపై ప్రభుత్వం స్పందించాలని, అక్రమాలపై పూర్తిస్థాయి విచారణ జరపాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

'చాలా ఇబ్బందులకు గురి చేశారు. 9 లక్షల 90 వేలు మనకు తెలంగాణ గవర్నమెంట్ ఇస్తుంది. ఆ మొత్తం డబ్బలకు సామాన్ ఇప్పిస్తామని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు మాకు 7 లక్షల 30 వేలకే ఇచ్చారు. మిగతా 2 లక్షల 60 వేలు అడిగితే జీఎస్టీ, కమీషన్, ట్రాన్స్​పోర్టు అంటున్నారు. మొత్తం జీఎస్టీ లక్షా 80 వేలు అంటున్నారు'. -బాధితులు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.