మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండల పరిధిలో ఈనెల 10న జరిగిన రెండో దశ స్థానిక పోరులో ఓటు వేసిన బ్యాలెట్ పత్రాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇవి దేవరకద్ర మండలం డోకూర్ గ్రామ పరిధిలోని ఎన్నికలకు సంబంధించినవిగా అధికారులు తెలిపారు. రెండు బ్యాలెట్ పత్రాలపై హస్తం గుర్తుపై ఓటేసినట్లు ఉన్నాయి. సామాజిక మాధ్యమాల్లో ఉన్న బ్యాలెట్ పత్రాలపై తమకు ఎటువంటి ఫిర్యాదు రాలేదని, పత్రాలపై ఉన్న క్రమ సంఖ్య ఆధారంగా నిందితున్ని విచారణ చేస్తామని అధికారులు తెలిపారు.
ఇవీ చూడండి: నేడు తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన