మహబూబ్‌నగర్‌లోని ఆహార కల్తీ తనిఖీదారు కార్యాలయంలో అటెండర్ వాజీద్ రూ.4000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరకిపోయాడు. గద్వాలకు చెందిన భానుప్రకాశ్ తన డిస్ట్రిబ్యూటరీ ఏజెన్సీ లైసెన్స్ రెన్యువల్ కోసం ఆన్లైన్లో నమోదు చేసుకొని, సంబంధిత రుసుమును చెల్లించి ధరఖాస్తు చేసుకున్నాడు. లైసెన్స్ కాఫీ ఇచ్చేందుకు అంతే సరిపడా డబ్బులు తమకూ చెల్లించాలని సదరు అటెండర్ డిమాండ్ చేశాడు. ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు భానుప్రకాశ్ తెలపగా... పథకం వేసి పట్టుకున్నారు.
కార్యాలయంలో ఒక్కడే అటెండర్ ఉన్నాడని... మిగతా విషయాలపై విచారణ జరిపి ఏసీబీ కోర్టులో హాజరు పరచనున్నామని ఏసీబీ డీఎస్పీ వివరించారు. కార్యాలయానికి సంబంధించి ఎవరు లైసెన్స్ రెన్యూవల్ చేసుకోవాలన్నా... డబ్బుల కోసం వేధిస్తూ ఉండేవాడని ఫిర్యాదుదారుడు తెలిపాడు. నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకున్నా.. మళ్లీ అంతే రుసుము లంచం రూపేనా డిమాండ్ చేస్తుండటం వల్ల ఏసీబీని ఆశ్రయించానని వివరించాడు.