మహబూబ్నగర్ జిల్లా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా బిజినేపల్లి మండలం కారుకొండ తండా, ఆనకాని పల్లి, అన్కానిపల్లి తండాలు ముంపునకు గురవుతున్నాయి. వారికి నష్టపరిహారం అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ అతి తక్కువ మొత్తంలో కొంతమందికి మాత్రమే పరిహారం ఇచ్చారని రైతులు వాపోయారు. ఈ నెల 7 నుంచి కంపెనీ ముందు నిరసనలు ప్రారంభించారు. అధికారులు కూడా పట్టించుకోకపోవడం వల్ల ఈ రోజు గ్రామస్తుల మద్దతుతో ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నారు. తక్షణమే తమకు పరిహారం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. తమను ఆదుకుంటామని కనిపించకుండా పోయారాని ఎమ్మెల్యే తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం స్పందించకపోతే త్వరలోనే ప్రగతి భవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఆమరణ దీక్షలో పాలమూరు ప్రాజెక్టు నిర్వాసితులు - rangareddy project
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్వాసితులు బిజినేపల్లి మండలం వట్టెం హెచ్ఈఎస్ కంపెనీ ముందు రైతులు ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. నష్ట పరిహారం అందించడంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ రిలే నిరాహార దీక్షలు ప్రారంభించిన వీరు... అధికారులు స్పందించక పోవడం వల్ల దీక్షను ఉద్ధృతం చేశారు.