మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండల పరిధిలో నకలీ వరి విత్తనాలను వ్యవసాయశాఖ అధికారులు పట్టుకున్నారు. రాత్రి సమయాలలో మండల పరిధిలోని గ్రామాలకు తిరుగుతూ కొందరు అక్రమంగా నకిలీ విత్తనాలను అమ్ముతున్నట్టు సమాచారం అందుకున్న అధికారులు విచారణ చేపట్టారు. వెంకట్ రెడ్డిపల్లి గ్రామంలోని ఓ రైతు ఇంట్లో కొన్ని అనుమానాస్పద సంచులు ఉన్నట్టుగా గుర్తించారు. వెంటనే తనిఖీలు చేపట్టి బియ్యం బస్తాల పేరుతో ఉన్న సంచులలో నకిలీ వరి విత్తనాలు ఉన్నట్లు గుర్తించారు. 15 కిలోల బరువున్న 14 ప్యాకెట్లను అధికారులు సీజ్ చేశారు. ఒక్కో ప్యాకెట్‌ను వెయ్యి రుపాయలకు విక్రయిస్తూ.. సమీప గ్రామాలలో ఇప్పటికే వెయ్యి ప్యాకెట్‌లు అమ్మినట్టు అధికారులు గుర్తించారు. ఇంటి యజమాని పరారీలో ఉండగా.. ఇవి ఎక్కడి నుంచి సరఫరా చేస్తున్నారో గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
ఇవీ చూడండి: మంత్రివర్గ నిర్ణయం తప్పు ఎలా అవుతుంది:హైకోర్టు