ప్రమాదవశాత్తు నిప్పంటుకోవడం వల్ల హోటల్ పూర్తిగా దగ్ధమైన ఘటన మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో చోటు చేసుకుంది. సెలవుదినం కావడం వల్ల హోటల్ మూసివేసి ఉండగా తడకలతో ఏర్పాటు చేసిన హోటల్‌కు నిప్పంటుకుని మంటలు చెలరేగాయి. తడకలతో పాటు ఫ్రిజ్, కుర్చీలు, టేబుళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. నిరుపేద కుటుంబానికి చెందిన రవి కుమార్ ఇక్కడ హోటల్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ప్రమాదవశాత్తు జరిగిన ఈ ప్రమాదంలో అతడు సర్వస్వం కోల్పోయి వీధిన పడ్డాడు. స్థానికులు అగ్ని మాపక అధికారులకు సమాచారం ఇవ్వడం వల్ల అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు. దాదాపు లక్ష రూపాయల వరకు నష్టం వాటిల్లినట్టు హోటల్ యజమాని తెలిపారు.
ఇవీ చూడండి: మరి ఇంత నిర్లక్ష్యమా...!