ETV Bharat / state

పోలీసుల నైపుణ్యాలను పెంచేందుకు 'ఫైరింగ్ రేంజ్'

ప్రతి ఏడాది జిల్లా పోలీసు అధికారులకు ఆయుధాల ఫైరింగ్​పై​ శిక్షణ ఇస్తారు. దీనికోసం జడ్చర్లలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫైరింగ్​ రేంజ్​ను ఎస్పీ రేమా రాజేశ్వరి పూజలు చేసి ప్రారంభించారు. గతంలో కోయిలకొండ ప్రాంతలో శిక్షణ ఇచ్చేవారు.

author img

By

Published : Dec 7, 2020, 6:29 PM IST

A new firing range started at jadcherla  that enhances police skills in mahaboobnagar dist
పోలీసుల నైపుణ్యాలను పెంచే ఫైరింగ్ రేంజ్

ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లా పోలీసు అధికారులకు ఫైరింగ్​ శిక్షణ కోసం జడ్చర్లలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫైరింగ్ రేంజ్​ను ఎస్పీ రేమా రాజేశ్వరి పూజలు చేసి ప్రారంభించారు. గతంలో కోయిలకొండ ప్రాంతంలో శిక్షణ ఇచ్చేవారు. దీని వల్ల ఏర్పాట్లలో చాలా ఇబ్బందులు ఎదురయ్యేవి.

వాటిని అధిగమించేందుకు జిల్లా పోలీస్​ కేంద్రంలోనే ఫైరింగ్​ రేంజ్​ను ఏర్పాటు చేయాలని ఎస్పీ నిర్ణయించారు. ఈ శిక్షణ పోలీసులు నైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకు ఉపయోగపడుతుందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, డీటీసీ ప్రిన్సిపల్​ భాస్కరరావు, డీఎస్పీ సాయి మనోహర్​, ఎస్సైలు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:'పోస్టులు భర్తీ చేస్తారా.. కారుణ్య మరణాలకు అనుమతిస్తారా.?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.