ETV Bharat / state

Leopard died: పశువుల దాడిలో గాయపడిన చిరుత మృతి - telangana varthalu

గేదెల ఎదురుదాడిలో తీవ్రంగా గాయపడిన చిరుత చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ నెల 10న బూర్గుపల్లిలో దూడపై చిరుత దాడికి యత్నించగా... గేదెలు ఎదురుదాడి చేశాయి.

పశువుల దాడిలో గాయపడిన చిరుత మృతి
పశువుల దాడిలో గాయపడిన చిరుత మృతి
author img

By

Published : Jun 30, 2021, 4:57 AM IST

గేదెల ఎదురుదాడిలో తీవ్రంగా గాయపడిన చిరుతపులి చికిత్స పొందుతూ మృతి చెందింది. మహబూబ్​నగర్​ జిల్లా కోయిల్​కొండ మండలం బూర్గుపల్లిలో ఈ నెల 10న రైతు నవాద్​రెడ్డి తన పశువులను పొలం అంచున ఉన్న గుట్టల్లో మేతకు వదలగా.. గుట్టల్లో దాక్కొని ఉన్న చిరుత ఓ దూడపై దాడికి యత్నించింది.

గేదెలు తిరగబడి కుమ్మడంతో చిరుత నడుము, కాళ్లకు గాయాలై కదలలేని స్థితిలో ఉండిపోయింది. అటవీశాఖ అధికారులు చిరుతను హైదరాబాద్​లోని జూపార్క్​కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న చిరుత కోలుకోలేక సోమవారం మృతి చెందినట్లు మహబూబ్​నగర్​ జిల్లా అటవీ శాఖ అధికారి గంగారెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి: నడవలేని స్థితిలో చిరుత.. గేదెల దాడే కారణమని అనుమానం..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.