ETV Bharat / state

ట్రాక్టర్​ బోల్తాపడి యువకుడి మృతి - ts news

పొలం దమ్ము చేస్తున్న క్రమంలో ట్రాక్టర్​ బోల్తా కొట్టడం వల్ల యువకుడు మృతి చెందిన ఘటన మహబూబాబాద్​ జిల్లా కాచికల్లు గ్రామంలో జరిగింది. యువకుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

young man died when tractor overturns in farm in mahabubabad district
ట్రాక్టర్​ బోల్తాపడి యువకుడి మృతి
author img

By

Published : Aug 3, 2020, 4:57 AM IST

పొలం దున్నుతుండగా ట్రాక్టర్ బోల్తా పడి యువకుడు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం కాచికల్లు గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలో శ్రీధర్(25) అనే యువకుడు ట్రాక్టర్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రోజూలాగే పొలం దున్నుతుండగా ట్రాక్టర్ బురదలో దిగబడింది. ట్రాక్టర్​ను బయటకు తీసే ప్రయత్నం చేస్తుండగా ఒక్కసారిగా పైకి లేకి తిరగబడింది.

ఈ క్రమంలో శ్రీధర్​ ఛాతీని స్టీరింగ్​ బలంగా తాకడంతో పాటు కాలు, టైర్ల మధ్యలో ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. శ్రీధర్​ బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇవీ చూడండి: వ్యక్తిని ఢీకొట్టిన కారు... బ్యాంక్ మేనేజర్ మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.