విద్యార్థుల సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని.. తక్షణమే సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ డివిజన్ కేంద్రంలో పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించారు. అసెంబ్లీ సమావేశాల్లో విద్యార్థుల కోసం 30 శాతం బడ్జెట్‌ను కేటాయించుకుంటే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఇవీ చూడండి: 'చంద్రయాన్-2 ల్యాండర్, రోవర్‌పై ఆశలు గల్లంతు'