మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన సామాజిక సేవకుడు గర్రెపల్లి వెంకటేశ్వర్లు వర్షపునీటిని భూమిలోకి ఇంకించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవైపు తన గోశాలలో సొంత ఖర్చులతో ఇంకుడు గుంతలను తవ్వించి వర్షపునీటిని ఒడిసి పట్టేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాడు. ఇంకుడు గుంతలు ఉండటం వల్ల కలిగే లాభాలను తెలియజేస్తూ ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు కరపత్రాలను ముద్రించి ప్రజలందరికీ పంచి పెడుతున్నాడు. ఓ ప్రచార రథాన్ని తయారు చేయించి మొక్కల పెంపకం, పంపిణీ వివరిస్తూ 108 రోజులపాటు ప్రచారం ప్రారంభించారు.
వాగులపై ప్రతీ రెండు కిలో మీటర్లకు ఒక చెక్ డ్యామ్‌ను ప్రభుత్వం నిర్మిస్తే భూగర్భ జలాలు పెంపొంది రైతులకు సాగు నీరు కూడా అందుతుందన్నారు.
ఇవీ చూడండి : ఈసెట్ అభ్యర్థులకు తుదిదశ సీట్ల కేటాయింపు