ETV Bharat / state

మంత్రి పదవి కోసం ఎర్రబెల్లి ఏమైనా చేస్తాడు: రఘునందన్​ - bjp mlc elections meeting in thorrur

పాలకుర్తి నియోజకవర్గాన్ని సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాలతో పోల్చుకోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావుకు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్​రావు సూచించారు. పాలకుర్తికి ఏం చేశారని ప్రశ్నించారు. పట్టభద్రుల ఎన్నికల దృష్ట్యా మహబూబాబాద్​ జిల్లా తొర్రూరులో భాజపా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.

raghunandan rao
రఘునందన్​ రావు
author img

By

Published : Mar 5, 2021, 5:40 PM IST

మంత్రి పదవి కోసం ఎర్రబెల్లి దయాకర్​రావు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారని దుబ్బాక భాజపా ఎమ్మెల్యే రఘునందన్​రావు ఎద్దేవా చేశారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి పాలకుర్తి నియోజకవర్గానికి కనీసం డిగ్రీ కళాశాల కూడా తీసుకు రాలేదని విమర్శించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. సమావేశంలో మంత్రి ఎర్రబెల్లిపై రఘునందన్​ విమర్శలు గుప్పించారు.

సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాలతో పాలకుర్తిని పోల్చుకొని మంత్రి ఆత్మవిమర్శ చేసుకోవాలని రఘునందన్​ హితవు పలికారు. తెరాస పాలనలో ఒక్క డీఎస్సీ పరీక్ష కూడా పెట్టని సీఎం కేసీఆర్​కు ఓటు అడిగే అర్హత లేదని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్​ఛార్జి పెద్దగాని సోమయ్య, భాజపా నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: పదవులు లేకున్నా ప్రజల పక్షాన పోరాడతా: ఎల్‌.రమణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.