మహబూబాబాద్ మరిపెడ మండలం ఎల్లంపేటకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ నరేష్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాకు పాల్పడ్డాడు. వెంటనే మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించినప్పటికీ... ఫలితం లేకుడా పోయింది. మృదేహంతో అఖిలపక్షం నాయకులు ఆసుపత్రి నుంచి ప్రదర్శన నిర్వహించారు. డిపోలోకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించగా పోలీసుల అడ్డుకున్నారు. కాసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. దాదాపు ఏడు గంటలకు పైగా కార్మికులు ధర్నా నిర్వహించారు.
కార్మిక సంఘాలు, అఖిలపక్ష నాయకులతో జిల్లా ఎస్పీ పలుమార్లు చర్చలు జరిపారు. 12 లక్షల పరిహారం, నరేష్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, రెండు పడకల గదుల ఇల్లు ఇస్తామని జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి... ఎస్పీ కోటిరెడ్డి, జాయింట్ కలెక్టర్ డేవిడ్ హామీ ఇచ్చారు. మూడెకరాల భూమి కూడా ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని స్పష్టం చేశారు. ఏడు గంటల ఆందోళన అనంతరం పోస్టమార్టానికి తరలించారు. సంతాపంగా గురువారం జిల్లా బంద్‌కు ఆర్టీసీ ఐకాస పిలుపునిచ్చింది.
ఇదీ చూడండి: తాగి రెచ్చిపోయిన గల్లీ లీడర్లు.. జై కొట్టిన పోలీసులు