మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చేస్తున్న జన ఆశీర్వాద యాత్రను తెరాస, దళిత సంఘాల నాయకులు అడ్డుకున్నారు. పార్లమెంటులో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గకరణ బిల్లును వంద రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పిన భాజపా ప్రభుత్వం.. ఏడేళ్లు గడుస్తున్నా చేయకపోవడం దారుణమని నిరసనకారులు తెలిపారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేస్తుంది జన ఆశీర్వాద సభ కాదని.. మాదిగలను వంచించే సభగా తాము భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అడుగడుగునా దళితులు... ప్రతీ మాదిగ బిడ్డ జన ఆశీర్వాద సభను అడ్డుకోవాలని సూచించారు.
ప్రధాని మోదీ, కిషన్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ... గందరగోళం సృష్టించారు. విషయం తెలుసుకున్న పోలీసులు... నిరసనకారులను అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఇదీ చూడండి: Voter Enrollment: ఓటరు కార్డుల్లో మార్పులు, దరఖాస్తులకు ఆహ్వానం