ETV Bharat / state

ట్రాఫిక్ సిగ్నల్స్, సీసీ కెమెరాలు ఎంతో అవసరం - cc cemera, traffic signals launching by sathyavathy ratod news

ప్రమాదాలు, క్రైమ్ రేటు తగ్గాలంటే ట్రాఫిక్ సిగ్నల్స్, సీసీ కెమెరాలు ఎంతో అవసరమని గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ అన్నారు. జిల్లాకి వచ్చే ప్రజలంతా ట్రాఫిక్ సిగ్నల్స్ చూసుకొని తమ వాహనాలను నడపాలని, ఇష్టా రీతిలో వాహనాలు నడిపితే ఫైన్లు పడుతాయని హెచ్చరించారు.

Traffic signals and CCTV cameras are much needed
ట్రాఫిక్ సిగ్నల్స్, సీసీ కెమెరాలు ఎంతో అవసరం
author img

By

Published : Dec 26, 2020, 10:54 PM IST

ప్రమాదాలు క్రైమ్ రేటు తగ్గాలంటే ట్రాఫిక్ సిగ్నల్స్, సీసీ కెమెరాలు ఎంతో అవసరమని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఏడున్నర లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్​ను జిల్లా ఎస్పీ నంద్యాల కోటి రెడ్డి, కలెక్టర్ గౌతమ్, ఎమ్మెల్యే శంకర్ నాయక్ లతో కలిసి ప్రారంభించారు.

పోలీసులు ఎంత మంది ఉన్నా మనలో క్రమశిక్షణ లేకపోతే లక్ష్యం నెరవేరదని మంత్రి స్పష్టం చేశారు. మహబూబాబాద్ పట్టణ అభివృద్ధికి రూ.50 కోట్ల మంజూరు అయ్యాయని తెలిపారు. జిల్లాకి వచ్చే ప్రజలంతా ట్రాఫిక్ సిగ్నల్స్ చూసుకొని తమ వాహనాలను నడపాలని, ఇష్టా రీతిలో వాహనాలు నడిపితే ఫైన్లు పడుతాయని హెచ్చరించారు.

"తమ వాహనం కూడా హైదరాబాద్​లో ట్రాఫిక్ సిగ్నల్స్ ఉల్లంఘించడంతో రూ. 9 వేల ఫైన్ పడిందని, తానే స్వయంగా ఫైన్ కట్టాన"ని ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు.

పట్టణంలో ఫారెస్ట్ ఆఫీస్ సెంటర్​లో మొట్టమొదటి సారిగా ట్రాఫిక్ సిగ్నల్స్​ను ప్రారంభిస్తున్నామని, మిగతా కూడళ్లలో కూడా త్వరలోనే సిగ్నల్స్​ను ప్రారంభిస్తామని ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు.

ఇదీ చూడండి: అత్యాచారం చేసి.. రైలులోంచి నెట్టేసి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.