మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో టీపీటీఎఫ్ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మైస శ్రీనివాస్ పాల్గొని రాష్ట్ర విద్యాశాఖ జారీ చేసిన ఆన్లైన్ తరగతుల జీవోను ఉపసంహరించుకోవాలని.. ప్రభుత్వ పాఠశాలల్లో సర్వీస్ పర్సన్స్, అటెండర్లు, నైట్ వాచ్మెన్లను నియమించాలని కోరారు. ఆన్లైన్ వర్క్షీట్లను ప్రభుత్వమే ముద్రించి పాఠశాలలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.
కేంద్ర మార్గదర్శకాల ప్రకారం 50 శాతం ఉపాధ్యాయులే విధులకు హాజరయ్యేలా చూడాలని.. దానికి అనుగుణంగా రాష్ట్రంలో 50 సంవత్సరాలు దాటిన, దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న, దివ్యాంగ ఉపాధ్యాయులకు ప్రస్తుతం విధుల నుంచి మినహాయింపును ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆన్లైన్ తరగతులకు సంబంధించి ప్రభుత్వం మరోసారి పునరాలోచించాలని, పాఠశాలలు తెరిచి ఒక రోజు ఒక తరగతికి, మరో రోజు మరో తరగతికి విద్యను బోధించే విధంగా చూడాలని కోరారు.
ఇదీ చూడండి : నేడు ఈసెట్ పరీక్ష... కరోనా కాలంలో తొలి పరీక్ష