మైనారిటీల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలో నిర్వహించిన క్రిస్మస్ కానుకల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దంతాలపల్లి, నర్సింహులపేట మండలాలకు చెందిన సుమారు 240 మందికి క్రిస్మస్ కానుకలను పంపిణీ చేశారు. అనంతరం 16 మందికి కల్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. డోర్నకల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో సుమారు 1000 మందికి క్రిస్మస్ కానుకలు అందజేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పలువురు స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి : ప్రాణం మీదికొచ్చిన చిన్నపాటి గొడవ