మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తానంచర్ల శివారులోని తండాలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో ఓ వ్యక్తి తన కూతురిని మోసం చేశాడని భూక్యా ఠాగూర్(48) అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
భూక్యా ఠాగూర్‌కు భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. కాగా చిన్న కుమార్తెను పక్క తండాకు చెందిన ఓ వ్యక్తి ప్రేమ పేరుతో మోసం చేశాడు. దీంతో తండా పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు. అయినా తన కూతురికి న్యాయం జరగకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు. అక్కడా స్పందన లేకపోవడం వల్ల తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఇవీ చూడండి: పశువైద్యురాలి పేరు ఇకపై 'జస్టిస్ ఫర్ దిశ'