కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ఇంటింటి సర్వేకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మహబూబాబాద్ జిల్లాలోని 461 గ్రామ పంచాయతీలు, 4 మున్సిపాలిటీల్లో సర్వే చేయడానికి ఆశా, అంగన్వాడీ, పంచాయతీ కార్యదర్శులు, మున్సిపల్ సిబ్బందితో 728 బృందాలను ఏర్పాటు చేశారు. ఇంటింటికి తిరుగుతూ జ్వరం, దగ్గు, జలుబుతో పాటు ఇతర లక్షణాలు ఉన్నవారిని గుర్తిస్తున్నారు. అవసరమైన వారికి కిట్లను అందజేస్తున్నారు. కేసముద్రం మండల కేంద్రంలో జరుగుతున్న ఇంటింటి సర్వేను కలెక్టర్ గౌతమ్, అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్‌లు పరిశీలించారు. సర్వే బృందంతో కలిసి కొన్ని ఇళ్లకు వెళ్లారు.
2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 7,74,549 మంది ఉన్నారు. ఒక్కో బృంద సభ్యుడు 50 ఇళ్లలో సర్వే చేస్తున్నారు. మొదటి రోజు కరోనా ప్రాథమిక లక్షణాలు కలిగిన 548 మందిని గుర్తించి... వారికి కిట్లను అందించారు. ఇళ్లలోనే ఉండాలని సూచించారు. వైరస్‌పై అవగాహన కల్పిస్తున్నారు.
ఇదీ చదవండి: త్వరలో అందుబాటులోకి జైడస్ టీకా!