ETV Bharat / state

ప్రిన్సిపల్​ను సస్పెండ్​ చేయాలని డిమాండ్​ చేస్తూ రాస్తారోకో - kuravi news

మహబూబాబాద్​ జిల్లా కురవిలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఆందోళన నిర్వహించారు. ముక్కిపోయిన బియ్యంతో వండిన భోజనం పెట్టిన ప్రిన్సిపల్‌ను వెంటనే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

sfi leaders rastaroko on demand of suspend the principal

author img

By

Published : Oct 9, 2020, 4:22 PM IST

మహబూబాబాద్‌ జిల్లా కురవిలోని ఏకలవ్య బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపల్‌ను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. విద్యార్థులకు ముక్కిపోయిన బియ్యంతో వండిన భోజనం పెట్టారని నాయకులు ఆరోపించారు. ఆ భోజనం తిని విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు.

ప్రిన్సిపల్‌ నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిందని... బాధ్యులైన అందరినీ తక్షణమే విధుల నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. ఆందోళనతో రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులకు నచ్చజెప్పి ఆందోళనను విరమింపజేశారు.

ఇదీ చూడండి;బైక్​పై​ వెళ్తున్న ప్రేమజంటపై సినీ ఫక్కీలో దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.