మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలకేంద్రంలోని అంబేడ్కర్ భవనాన్ని మున్సిపాలిటీ అధికారులు.. మంగళవారం తెల్లవారుజామున కూల్చివేశారు. ఆ స్థానంలో మార్కెట్‌ను నిర్మించేందుకు జేసీబీల సాయంతో భవనాన్ని పూర్తిగా తొలగించారు.
విషయం తెలుసుకున్న ఎస్సీ, ఎస్టీ సంఘాలు కూల్చివేసిన ప్రదేశానికి చేరుకుని ఆందోళనకు దిగారు. అంబేడ్కర్ భవనాన్ని ఎలా కూల్చివేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వారిని అడ్డుకోగా స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.
ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అంబేడ్కర్ భవనం వద్ద డీఎస్పీ నరేశ్ కుమార్ ఆధ్వర్యంలో 100 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.
- ఇదీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 2,166 కరోనా కేసులు, 10 మరణాలు