తెలంగాణ ప్రభుత్వం.. రాష్ట్రంలోని అన్నదాతలకు అండగా నిలిచేందుకు అనేక పథకాలు ప్రవేశపెడుతోందని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం నేరడ, మోద్గులగూడెం, తాల్లసంకీస, కాంపెల్లి గ్రామాల్లో రైతు వేదిక భవన నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం హరితహారంలో భాగంగా రైతు వేదిక భవనాల వద్ద మొక్కలు నాటి నీళ్లు పోశారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా రైతును రాజుగా మార్చేందుకు వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించి... వారికి భరోసా కల్పించేందుకు ప్రభుత్వ ప్రతి క్లస్టర్‌కు రూ. 22 లక్షల వ్యయాన్నిచ్చి రైతు వేదిక భవనాలు నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
ఇదీ చూడండి:- మార్స్ యాత్రకు కౌంట్‌డౌన్- రోవర్ విశేషాలు తెలుసా?