మహబూబాబాద్ జిల్లా జమాండ్లపల్లి శివారులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు ద్విచక్రవాహనాలను బొలెరో వాహనం వెనుక నుంచి ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందగా.. మరో ఐదుగురు గాయపడ్డారు.
నెల్లికుదురు మండలం మునిగలవీడు గ్రామానికి చెందిన కిరణ్ కుమార్ అనే యువకుడి పుట్టినరోజు సందర్భంగా.. ఆరుగురు మిత్రులు.. రెండు ద్విచక్ర వాహనాలపై ఓ అనాథ ఆశ్రమంలో అన్నదానం చేసి తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులను మహబూబాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. మృతిచెందిన యువకుడు అనిల్‌గా గుర్తించారు.