మహబూబాబాద్ జిల్లా కొత్తతండా వద్ద లారీ- ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం గోపాలపురం గ్రామానికి చెందిన టి.ఆనంద్‌రావు అనే వ్యక్తి మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని బీసీ వసతిగృహంలో ఒప్పంద ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ద్విచక్ర వాహనంపై తొర్రూరుకు వెళ్తుండగా... వరంగల్ నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న ఓ లారీ ఆనందరావు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. తలకు బలమైన గాయాలు కావడం వల్ల ఆయన అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు ప్రమాదస్థలాన్ని పరిశీలించి.. కేసు దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చూడండి: 'టిక్‌టాక్' చేస్తూ మెడలు విరగ్గొట్టుకొన్న యువకుడు